కింగ్ నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన “లవ్ స్టోరీ” టీమ్


యువ సామ్రాట్ నాగచైతన్య , సాయి పల్లవి జంటగాసెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. ఏమిగోస్ క్రియేషన్స్,సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వరసినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ రోజు కింగ్నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘‘లవ్ స్టోరీ’’ మేకర్స్ ఆయన కు శుభాకాంక్షలుతెలుపుతూ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాగచైతన్య,సాయి పల్లవి లు చాలా ప్లజెంట్ గా హ్యాపీగా కనిపిస్తున్నారు.

ఇంకా 15 రోజుల షూటింగ్ మినహా సినిమా అంతా కంప్లీట్ అయింది.పరిస్థితులు అనుకూలించిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టి.సరైన సమయంలో మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలుపోషిస్తున్నారు.