బీజేపీ ఫుల్ గేమ్ ఆడితే టీఆర్ఎస్ కు మైండ్ బ్లాంకే: కిషన్ రెడ్డి

బీజేపీ పూర్తిస్థాయి ఆట మొదలుపెడితే ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్న టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. బాధ్యతలు, హామీలు మరచి మంత్రి కేటీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారని.. అందుకు ఆయనకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఏడేళ్లుగా వర్సిటీల్లో ప్రొఫెసర్లు లేక మూతపడే స్థితికి చేరుకున్నాయని మండిపడ్డారు.

అక్కడ పథకం ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ దాడులపై అమిత్ షా సైతం ఆరా తీశారని అన్నారు. టీఆర్ఎస్ అండతోనే మజ్లిస్ పార్టీ భయానక పరిస్థితులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇక్కడ కలహాలకు కారణమైన మజ్లిస్ నేతలను వదిలేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవరిస్తోందని ఆరోపించారు. గతంలో మతకలహాల ఘటనలు జరిగినప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించినా పరిస్థితిలో మార్పు లేదని అన్నారు. భైంసా ఘటనలు, ఫిర్యాదులపై పూర్తి నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతానని అన్నారు.