బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ నటించిన `భరత్ అనే నేను` చిత్రంతో పరిచయమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన `వినయ విధేయరామ`లోనూ మెరిసి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మన్యవార్ కమర్షియల్స్ల్లోనూ కనిపించి తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అనురాగ్ కశ్యప్ రూపొందించిన `లస్ట్ స్టోరీస్`తో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచి షాకిచ్చింది.
బాలీవుడ్ టాలీవుడ్ లో మొస్ట్ క్రేజీ హీరోయిన్ గాఅత్యంత డిమాండ్ వున్న స్టార్ నాయికగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ ల క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న కియారా తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న కియారా ఒక్కో సినిమాకి దాదాపు 4 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ లో బిగ్ లైనప్ ని ఫిక్స్ చేసుకుని యమ బిజీగా మారిన కియారా తాజాగా ఓ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడం.. దాని కాస్ట్ కోటికి పైనే వుండటం హాట్ టాపిక్‌గా మారింది.
లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్న కియారా దగ్గరి ఇప్పటికే కొన్ని లగ్జరీ కార్లున్నాయి. అందులో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. బీఎండబ్ల్యూ కి చెందిన ఆడీ కారుని సొంతం చేసుకుంది. అడీ ఎ 8 ఎల్ మోడల్ కి చెందిన ఈ కారు ఖరీదు అక్షరాల 1.60 లక్షలు. ఈ కారుని కియారాకు అందిస్తూ ఆడీ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజా వెర్షన్ 2020లో లాంచ్ చేశారు. ఈ మోడల్ 2021కి గానూ సీబీఎన్ కార్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది.