ప్రభాస్ ఆదిపురుష్ లో పెదనాన్న కృష్ణంరాజు?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న తొలి బాలీవుడ్ చిత్రం ఆది పురుష్. బాహుబలి నుండే ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న ప్రభాస్, ఇక్కడి నిర్మాతలు, దర్శకులతోనే పనిచేసాడు. సాహో, రాధే శ్యామ్, తర్వాత నాగ్ అశ్విన్ సినిమాకు కూడా దర్శక, నిర్మాతలు ఇక్కడి వారే. మార్కెట్ కోసం బాలీవుడ్ నటులను ఈ చిత్రాల్లో పెట్టుకున్నారు.

అయితే ఆది పురుష్ విషయంలో అలా కాదు. దర్శకుడు ఓం రౌత్, నిర్మాణ సంస్థ టి సిరీస్ బాలీవుడ్ వే. ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి మొదలవుతుందని అంటున్నారు. పూర్తిగా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతో పూర్తిగా ఇండోర్ లోనే ఈ చిత్రాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఇప్పుడు బయటపడింది. ఆది పురుష్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ మధ్య కాలంలో కృష్ణంరాజు నటించింది లేదు. ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ప్రభాస్ సరసన ఆఖరుగా రెబెల్ లో కనిపించాడు. మళ్ళీ ఇప్పుడు ముఖానికి రంగు వేసుకుంటాడన్న రూమర్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది.