తెలంగాణ స్లాంగ్ లో అలరించనున్న బేబమ్మ

బేబమ్మగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైంది ఉప్పెన భామ కృతి శెట్టి. ఈ చిత్రం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఉప్పెన ప్రోమోలతోనే ఆకట్టుకున్న కృతికు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఉప్పెన విడుదల తర్వాత ఈ భామ ఇండస్ట్రీలో అందరి ఫెవరెట్ అయింది. ఆమె డేట్స్ కోసం ఇప్పుడు ఎందరో నిర్మాతలు క్యూలో ఉన్నారు.

ఉప్పెన తర్వాత సైన్ చేసిన సినిమాల్లో నాని శ్యామ్ సింగ రాయ్ మొదటిది కాగా, సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మరొకటి. ఈ చిత్రానికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.

ఇక షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా గురించి తెలిసిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో కృతి శెట్టి మొత్తం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుందిట. తొలి సినిమాలో గోదావరి స్లాంగ్ ను ఫాలో అయిన కృతి ఈ సినిమాతో ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.