బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో ఇటివల ఉద్యోగాల నోటిపికేషన్లు ఇవ్వడంలేదంటూ ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాజకీయంగానూ ఈ అంశం వార్తల్లో నిలిచింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. కేయూ విద్యార్ధి సునీల్ ను రెచ్చగొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఉద్యోగాలివ్వడం లేదని ఆరోపిస్తున్న ఏబీవీపీ నాయకులు ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ నేతలు పబ్బం గడుపుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సునీల్ ఆత్మహత్యకు ముందు వీడియోలో తాను ఐఏఎస్ కావాల్సిన వాడినని పేర్కొన్నాడు. ఐఏఎస్ నోటిఫికేషన్లు ఎవరిస్తారు? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీ, కాంగ్రెస్ కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉత్తమ్ కుమార్, బండి సంజయ్ ఎక్కడున్నారంటూ కేసీఆర్ ప్రశ్నించారు.