కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిం గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లో సురభి వాణికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణపై ఆనాటి ప్రధానిపై విమర్శలు చేసిన మోదీ ఇప్పుడు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు.
దేశ జీడీపీ పెరింగిందని అంటున్నారని.. అంటే గ్యాస్, డీజిల్, పెట్రోలే కదా అని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఇవి తప్ప దేశంలో అభివృద్ధి పెరగలేదని అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చేయాల్సింది వదిలేసి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇస్తామన్న హామీలను కూడా గాలికి వదిలేశారని అన్నారు.