బిగ్‌బాస్‌ గేమ్‌ : నటి సంచలన వ్యాఖ్యలు


చెన్నై : బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌ 4లో తాను పాల్గొనడం​ లేదని కోలీవుడ్‌ నటి లక్ష్మీ మీనన్‌ స్పష్టం చేశారు. అలాంటి చెత్త షోలో తాను పాల్గొనబోనని ఆమె తేల్చిచెప్పారు. ఇతరులు తిన్న ప్లేట్లు కడగడం,ఇతరులు వాడిన టాయిలెట్లు శుభ్రం చేయడం వంటి పనులు తాను చేయనని, ఇక ముందూ అలాంటి పనులు చేయనని చెప్పారు. బిగ్‌బాస్‌ షోలో తాను పాల్గొంటున్నట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. షో పేరుతో కెమెరా ముందు ఇతరులతో తాను ఫైట్‌ చేయాలనుకోనని తన ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో తెలిపారు. బిగ్‌బాస్‌ షోపై తాను స్పష్టంగా వివరణ ఇచ్చిన తర్వాత ఈ చెత్త షోలో తాను పాల్గొంటానని ఎవరూ ఊహాగానాలు చేయబోరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజ‌మేనా?

కాగా లక్ష్మీ మీనన్‌ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్లేట్లు కడిగేవారు, టాయిలెట్లను శుభ్రపరిచేవారిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన స్టోరీపై పలువురు నెగెటివ్‌ మెసేజ్‌లు పంపుతున్నారని, ఇది తన అభిప్రాయమని..కొందరు ఈ షోను ఇష్టపడితే మరికొందరు ఇష్టపడరని లక్ష్మీ మీనన్‌ వివరణ ఇచ్చారు.ఇంటి వద్ద తన ప్లేట్లను తాను కడుగుతానని, తన టాయిలెట్‌ను తాను శుభ్రపరుస్తానని..కెమెరా ముందు అలాంటి పనలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎవరినో బాధపెట్టేందుకు ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఇక కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ తమిళ్‌ నాలుగో సీజన్‌ అక్టోబర్‌ 4 నుంచి ప్రసారం కానుంది.