బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘బెల్ బాటమ్’ ట్రైలర్ ఇటీవల విదులయ్యింది. ప్రయాణికులతో ఉన్న విమానం హైజాక్ కి గురైతే వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈ చిత్రం రోపొందింది. బెల్ బాటమ్ ఆగస్టు 19 న విడుదలకి సిద్ధం అవుతోంది. అయితే ఒక పాత్ర మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
1984 నేపథ్యం తో సాగే ఈ చిత్రం లో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్ర కూడా ఉంది. బాలీవుడ్ నటి ఈ చిత్రం కోసం ఇందిరా గాంధీలా మారిపోయింది. ఎంతలా అంటే ఎవరూ లారా దత్త ని గురుపట్టలేనంత గా. నెటిజన్లు లారా దత్త ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఒక పాత్ర కోసం లారా దత్త పడ్డ కష్టం చూసి ట్రైలర్ చూసినవారందరూ నోరెళ్లబెడుతున్నారు. లారా దత్త తో పాటు ఆమెని ఇందిరా గాంధీ పాత్రలో తీర్చిదిద్దిన మేకప్ అర్టిస్ట్ ని కూడా పొగుడుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ కి అవార్డు ఇవ్వాలని కూడా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
‘బెల్ బాటమ్’ చిత్రంలో అక్షయ్ కుమార్ ఒక స్పై గా నటిస్తున్నారు. ఇందులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు పెద్ద హైలైట్ గా ఉండబోతున్నాయి. యాక్షన్ చిత్రాలకు పేరు పొందిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ తో ఏ విధమైన ఎక్షామ్ అందిస్తారో చూడాలి.