టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ ఎవరంటే? ముందుగా గుర్తొచ్చేది యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠీనే. కెరీర్ లో భారీ సక్సెస్ లు లేకపోయినా ఇప్పటికీ అడపాదడపా అవకాశాలు అందుకుంటూ బండి ముందుకు లాగిస్తుంది. ఇటీవలే `హ్యాపీ బర్త్ డే` అంటూ ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా సైతం చేసింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
సోలో హీరోయిన్ గానే నెట్టుకు రావడం కష్టంగా మారిన హీరోయిన్ తో లేడీ ఓరియేంటెడ్ సినిమా చేసి సక్సెస్ అందుకోవాలని చూసారు. కానీ ఫలితాలు నిరాశపరిచాయి. అయినా అందాల రాక్షసి తగ్గేదే లేదు అంటుంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో చాకచక్యతని ప్రదర్శిస్తుంది. అమ్మడిలో ఆ ట్యాలెంట్ నే ఇంత దూరం నడిపించింది.
ఇప్పటికీ అదే పద్దతిని అనుసరిస్తూ అవకాశాలు ఒడిసిపట్టుకుంటుంది. సక్సెస్ లు లేవని దిగాలు చెందకుండా అవకాశాల కోసం ప్రయత్నించి ఏదో ఛాన్స్ తో మెప్పించే ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమే. అలా చేయాలన్న ఎంతో సంకల్పబలం ఉండాలి. అవన్నీ లావణ్యలో కనిపిస్తున్నాయి. తాజాగా అమ్మడు మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
సొగసరి ఓ సాహసోపేతమైన పాత్రకి సన్నద్ధం అవుతున్నట్లు ఓ వీడియో రూపంలో చాటింది. స్టంట్ మాస్టర్స్ ఆధ్యర్యంలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన స్టంట్స్ ని ప్రాక్టీస్ చేస్తుంది. శరీరాన్ని విల్లులా వంచుతూ.. బాడీలో ప్రతీ పార్ట్ కదిలేలా కఠోరంగా శ్రమిస్తుంది. సాధారణంగా తెలుగులో ఫేమస్ అయిన హీరోయిన్లు ఇలాంటి స్టంట్స్ చేయడం చాలా రేర్ .
ఆ కొద్ది మందిలో లావణ్య త్రిపాఠీ కనిపిస్తుంది. ఇప్పటికే అమ్మడి ఏజ్ 31 దాటింది. అయినా వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల యువతిలా యాక్షన్ సన్నివేశాలకు రెడీ అవుతోంది. ఇలాంటి కఠోర శిక్షణ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లు తీసుకుంటారు. అక్కడ నటీమణులు వయసుతో పనిలేకుండా యాక్షన్ సీన్స్ లో చెలరేగుతుంటారు.
అదే తరహాలో లావణ్య సైతం అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ధీటుగానే శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. అమ్మడు మంచి ఫిట్ నెస్ ప్రీక్ కూడా. లావణ్య అందం..అభినయం ఇంకా చెక్కు చెదరలేదంటే? కారణం మంచి హ్యాబిట్స్ కలిగి ఉండటమే.