‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా హీర అల్లు శీరిష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. కాగా అందాల రాక్షసితో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత స్టార్‌హీరోయిన్‌గా ఎదిగారు.
https://twitter.com/AlluSirish/status/1338729199775875072
హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలే భలే మాగాడివోయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మన్మధుడు’ నాగార్జున అక్కినేని సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో నటించి టాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తున్నారు. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా లావణ్య చీర కట్టులో మెరిసిపోతున్న కొన్ని హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/p/CIpghblrQNo/