లైగర్ లో ఐటమ్ పాప ఎవరు?

పుష్పలో ఐటమ్ సాంగ్ అంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మరోసారి కమర్షియల్ చిత్రాల్లో మాస్ ఐటమ్ సాంగ్స్ పై దృష్టి పడింది. తెలుగులో ఐటమ్ సాంగ్స్ ఎప్పటినుండో ఉన్నాయి. అయితే గతంలో వాటికోసం ఐటమ్ భామలు ఉండేవారు. వాళ్ళు మాత్రమే స్పెషల్ సాంగ్స్ లో ఆడి పాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తున్నారు.

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న లైగర్ లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఐటమ్ సాంగ్ చేయని ఒక టాప్ హీరోయిన్ చేత ఈ పాట చేయించాలని పూరి భావిస్తున్నాడు. లైగర్ ప్యాన్ ఇండియన్ చిత్రం కావడంతో బాలీవుడ్ భామ అయితే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నాడు.

అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. త్వరలోనే స్పెషల్ సాంగ్ తాలూకు అప్డేట్ వస్తుంది.