మా ఎలక్షన్స్.. లంచ్‌, డిన్నర్‌ మీట్‌లు

మా ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. పెద్ద ఎత్తున ఈసారి అంచనాలు ఉన్నాయి. అందుకు కారణాలు తెల్సిందే. ఒక వైపు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తూ ఉంటే మరో వైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు బరిలోకి దిగబోతున్నాడు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్‌ ను ప్రకటించాడు. ఇటీవల గణపతి కాంప్లెక్స్ వద్ద మా సభ్యుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రకాష్ రాజ్ లంచ్ మీట్‌ ఏర్పాటు చేసి సభ్యులకు తన యొక్క విధి విధానాలను వివరించాడు. పది కోట్లతో సభ్యుల సంక్షేమం కోసం కార్పస్ ఫండ్‌ ను ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించాడు.

తాజాగా పార్క్‌ హయత్‌ లో మా సభ్యుల కోసం మంచు విష్ణు డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. డిన్నర్‌ మీట్ లో మంచు విష్ణు తన ప్యానల్ గురించి మాట్లాడుతూ నోటిఫికేషన్‌ వచ్చాక ప్రకటిస్తాను అంటూ వెళ్లడించాడు. మొత్తానికి మంచు విష్ణు పలు విషయాల్లో మా సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. మా సభ్యుల సంక్షేమం కోసం పాటుపడటంతో పాటు మా కోసం భవనం నిర్మిస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరుకున్నారు.