యూత్ ఫుల్ ఎంటర్టైలర్ గా గత శుక్రవారం విడుదలైన మ్యాడ్ సినిమా మొదటి రోజే చాలా పాజిటివ్ టాక్ అందుకుంది. మిగతా సినిమాలు కూడా పోటీగా ఉన్నప్పటికీ మ్యాడ్ కామెడీ యాంగిల్ లో బాగా అట్రాక్ట్ చేయడంతో ఓ వర్గం ఆడియన్స్ ఇటువైపు ఎక్కువగా యూటర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కామెడీ సినిమా రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ హీరోలుగా పరిచయమయ్యారు. ఇక సీతార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశం నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా చూస్తూ ఎవరైనా నవ్వుకోకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అంటూ నిర్మాత ఛాలెంజ్ చేసిన తీరు అందరిని బాగా ఎట్రాక్ట్ చేసింది.
దీంతో సినిమా పై కొంత పాజిటివ్ వెబ్ కూడా అప్పుడే పెరిగింది. అయితే నాగ వంశీ నమ్మినట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా మళ్లీ రెండో రోజు కంటే ఎక్కువగా మూడవరోజు రాబట్టింది.
ఇక ఈ మూడు రోజుల్లో కలుపుకొని మ్యాడ్ సినిమాకు 8.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. చిన్న బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని నిర్మాతలకు వెనక్కి తెచ్చేసింది. ఇక మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రావడం తో ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. వీకెండ్ లో ఎలాగు మంచి టాక్ తోటి బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సోమవారం నుంచి అసలు గేమ్ స్టార్ట్ కానుంది. దసరా వరకు పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావు కాబట్టి మరింత పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతే నిర్మాత జాక్ పాట్ కొట్టేసినట్లే.