మహేష్ 28: డేట్ మళ్ళీ మారిందే!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల..వైకుంఠపురములో సక్సెస్ తరువాత చాలా ఎక్కువ సమయం తీసుకుని మహేష్ బాబు స్క్రిప్ట్ పై రీ వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా నమ్మకంగా అనిపించిన తర్వాతనే మహేష్ బాబు షూటింగ్ మొదలుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే తీరా షూటింగ్ మొదలు పెట్టే సమయంలో నిర్మాతల కు సంబంధించిన స్ట్రైక్ మొదలు కావడంతో మరోసారి బ్రేక్ పడింది. అసలైతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు.
కానీ మళ్ళీ ఆలస్యం అయితే జరుగుతోంది. ఆగస్టు 15 16వ తేదీల్లో కూడా మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ అప్పటికి కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు.

ఇక ఇప్పుడు ఫైనల్ గా 21వ తేదీన ముహూర్తం ప్రకారం సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఒకసారి మొదలుపెడితే సినిమా షూటింగ్ కు పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఫినిష్ చేయాలి అని మహేష్ బాబు కూడా ఒక ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత మహేష్ బాబు మళ్లీ వెంటనే రాజమౌళి సినిమా కోసం రెడీ కానున్నాడు.

ఆ సినిమాకు కూడా మహేష్ బాబు సరికొత్త లుక్కులో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిట్నెస్ లో కూడా మొదటిసారి మహేష్ బాబు భారీ స్థాయిలో మార్పులు కూడా చేస్తాడని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఒక దశకు చేరుకున్నాయని ఈ ఏడాది చివరికల్లా మొత్తం ప్లాన్ రెడీ అవుతుందట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాలతో మహేష్ రేంజ్ ఇంకా ఎంతవరకు వేకుతుందో చూడాలి.