లవ్ స్టోరీ చెప్పిన మహేశ్ విట్టా.. పెళ్లి ఈ ఏడాదిలోనేనట

విలక్షణమైన యాసతో చాలా త్వరగా ప్రేక్షకుల మనసులో రిజిస్టర్ అయిన నటుల్లో ఒకరు మహేశ్ విట్టా. నటుడిగా సక్సెస్ అవుతున్న వేళలోనే.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టేసిన ఇతగాడు తాజాగా ఓటీటీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. టైటిల్ ఫేవరెట్ లలో ఒకడిగా ఉన్న అతడు.. తాజాగా తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. రెండేళ్లు కష్టపడితే కానీ తను ఓకే చెప్పలేదన్న మహేశ్.. ఆమెను ఈ ఏడాది పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పారు.

గత ఏడాది తమ లవ్ గురించి ఇద్దరింట్లో చెప్పామని.. అందరూ ఓకే చెప్పారన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి తన చెల్లెలకు స్నేహితురాలని.. ఆమెను రెండు సార్లు చూసినంతనే కనెక్టు అయ్యానని చెప్పాడు. అంతే.. తాను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే.. పరిచయం కాగానే ప్రపోజ్ చేయటమా? అని నో చెప్పేసిందని చెప్పాడు. దీంతో.. స్నేహితులుగా ఉందామని చెప్పానని.. దాంతో ఓకే చెప్పిన ఆమెతో రెండేళ్లు స్నేహం చేశాక.. తన ప్రేమకు ఓకే చెప్పినట్లు వెల్లడించాడు.

తన సినిమా విడుదలయ్యాక ఈ ఏడాది ఆగస్టు.. లేదంటే సెప్టెంబరులో తాను పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పాడు. ఇద్దరి ఇళ్లల్లో తమ పెళ్లికి ఓకే చెప్పారని.. తామిద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఇట్టే కలిసిపోతామని చెప్పాడు. తను ఐటీ ఉద్యోగిని అని చెప్పిన మహేశ్.. ఈసారి బిగ్ బాస్ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద కప్పు కొట్టుకొని వెళతానన్న ధీమాను వ్యక్తం చేశాడు. మరేం జరుగుతుందో చూడాలి.