ఈ ఏడాది సూపర్ స్టారే టాప్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద తన సినిమాల ప్రభంజనమే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాబుకు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ప్రతీ సంవత్సరం సోషల్ మీడియా ట్విట్టర్ లో వివిధ రంగాలకు సంబంధించి ఎక్కువగా ట్వీట్ చేసిన అంశాలకు ర్యాంకింగ్ ఇస్తారు.

అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ట్వీట్ చేసిన సినిమా పేరు రికార్డ్స్ ను తీస్తే ఇండియా వైడ్ గా సరిలేరు నీకెవ్వరు టాప్ 3 ప్లేస్ ను సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం విడుదలైన దిల్ బేచారా చిత్రం గురించి అందరూ విపరీతంగా చర్చించుకున్నారు.

సో ఆటోమేటిగ్గా ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో సూర్య సినిమా సూరారై పొట్రు నిలిచింది. చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవడంతో ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో ఎక్కువగా చర్చించుకున్నారు. ఇక మూడో స్థానంలో సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఏడాది మొదట్లోనే ఈ సినిమా విడుదలైంది.

ఈ సినిమా కన్నా సూపర్ హిట్ సాధించిన చిత్రాలు ఇండియా వైడ్ గా బానే ఉన్నాయి. అయినా కానీ మహేష్ స్టార్ స్టామినాతో సరిలేరు నీకెవ్వరు హ్యాష్ ట్యాప్ టాప్ 3 స్థానాన్ని సాధించింది.