దుబాయ్‌లో మకాం వేసిన మహేష్.. మళ్లీ ఎందుకు?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల దుబాయ్‌లో జరుపుకున్నారు మహేష్ అండ్ టీమ్. ఈ షూటింగ్‌లో మహేష్‌తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే తాజాగా మరోసారి మహేష్ అండ్ టీమ్ దుబాయ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న దుబాయ్ వెళ్లి అక్కడ మరోసారి షూటింగ్ చేసేందుకు సర్కారు వారి పాట టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్‌ను ఏప్రిల్ 15 వరకు జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్, ఇతర నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది. తొలుత ఈ షెడ్యూల్‌ను అమెరికాలో నిర్వహించాలని చూసినా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో మరోసారి దుబాయ్‌లో ఈ షెడ్యూల్‌ను షూట్ చేసేందుకు సర్కారు వారి పాట టీమ్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.