స్టార్స్ ఫొటోలను వారి అభిమానులు వాట్సప్ డీపీలుగా స్టేటస్ లు గా పెట్టుకుంటారు. మరి స్టార్ లు వాట్సప్ డీపీలుగా ఏం పెట్టుకుంటారు అనేది ఎవరికైనా ఆసక్తికర అంశమే. సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాట్సప్ కు ఏం డీపీ పెట్టుకున్నాడు అనే విషయమై క్లారిటీ వచ్చింది. నాగార్జున తనకు మహేష్ బాబు నుండి వచ్చిన ఒక మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో మహేష్ బాబు డీపీ గర్జించే సింహం గా కనిపిస్తుంది. మహేష్ బాబు గర్జించే సింహంను తన డీపీగా పెట్టుకున్నాడు అంటూ అందులో చాలా అర్థం ఉండి ఉంటుంది అంటున్నారు.
మహేష్ బాబుకు నాగార్జునకు మద్య ఇంతకు ఏంటీ ఆ వాట్సప్ చాటింగ్ అనే విషయానికి వస్తే.. నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూసిన వెంటనే మహేష్ బాబు చాలా బాగుంది అంటూ ప్రశంసిస్తూ వాట్సప్ లో మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ కు నాగార్జు రిప్లై ఇచ్చి థ్యాంక్యూ చెప్పడంతో పాటు మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసుకుంటాను అని అడిగాడు. అందుకు మహేష్ బాబు తప్పకుండా తీసుకోండి అంటూ మెసేజ్ కు రిప్లై ఇచ్చాడు. ఈ మొత్తం కూడా నాగ్ రిలీజ్ చేసిన స్క్రీన్ షాట్ లో ఉంది.