బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు అవ్వడానికి టాలీవుడ్ హీరో అయినా కూడా హాలీవుడ్ హీరో కటౌట్ ఆయన సొంతం. మహేష్ బాబును బాలీవుడ్ చిత్రంలో నటింపజేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తనకు తెలుగు సినిమానే సౌకర్యంగా ఉంది అని పలుమార్లు తెలియజేసాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. ఇదిలా ఉంటే మహేష్ బాబును ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సంప్రదించడం జరిగిందని ప్రచారం బలంగా జరుగుతోంది.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత మధు మంతెన ఎప్పటినుండో రామాయణ 3డిను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. గతంలో హ్రితిక్ రోషన్ తో ఈ సినిమాను నిర్మించాలని ప్రయత్నాలు చేసాడు కానీ అవి నెరవేరలేదు. ఈ నేపథ్యంలో మధు రీసెంట్ గా మహేష్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.