మరో చిట్టి గుండెను కాపాడిన సూపర్ స్టార్

సినిమాల్లో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లల కోసం మహేష్ చేస్తోన్న సేవకు అందరూ గులాం అవుతున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో మహేష్ గుండె జబ్బుతో బాధపడుతోన్న చిన్నారులకు చికిత్సలు ఇప్పిస్తోన్న సంగతి తెల్సిందే.

ఇప్పటికే 1000కు పైగా ప్రాణాలను కాపాడి చరితార్థుడు అయ్యాడు మహేష్. రీసెంట్ గా మరో చిన్నారికి ప్రాణం పోసి వార్తల్లో నిలిచాడు. టి సుప్రీతా అనే చిన్నారి తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆమెకు అత్యంత ఖరీదైన వైద్య చికిత్స అవసరం. ఆ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించబడేలా చేసాడు మహేష్. ఈ వార్తను నమ్రత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే.