మహేష్ గ్రేస్ అద్భుతమంటోన్న బాలీవుడ్ హాట్ భామ

నటి కియారా అద్వానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వకముందే తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అందులో మొదటి చిత్రం భరత్ అనే నేను మంచి విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కియారా సరిగ్గా సరిపోయిందని చెప్పాలి. అలాగే తన క్యూట్ లుక్స్ తో ఇన్నోసెంట్ నటనతో తెలుగు ప్రేక్షకులను తన వలలో వేసుకుంది.

అయితే ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ ప్లాప్ అయినా కియారాను టాలీవుడ్ లో నటింపజేయాలన్న ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో బిజీగా ఉన్న కారణంగా ఆమె తెలుగు సినిమాలను ఒప్పుకోవట్లేదు. హిందీలో వరసగా టాప్ సినిమాల్లో నటిస్తూ తన రేంజ్ ను బాగా పెంచుకుంటోంది ఈ అమ్మడు.

కియారా అద్వానీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ను తెగ పొగిడేసింది. మహేష్ కు ఉన్న గ్రేస్ అద్భుతమని, ముఖ్యంగా తన చుట్టూ ఒక ఓరా ఉంటుందని ఆమె తెలిపింది. ఎంత సూపర్ స్టార్ అయినా చాలా హంబుల్ గా ఉండటం ఆయన ప్రత్యేకత అని గుర్తుచేసుకుంది.

ఇంతకీ కియారాను తెలుగు సినిమాల్లో నటింపజేయాలన్న మన నిర్మాతల ప్రయత్నాలు ఫలిస్తాయా?