సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆయన తనయుడు మహేష్ బాబుకు అమితమైన ప్రేమ, గౌరవం. తన ప్రతీ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడు మహేష్. ఎప్పుడూ తండ్రి నిర్ణయానికి విలువ ఇస్తుంటాడు. అయితే సినిమాల విషయంలో మహేష్ కు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. తనకు ఏది సూట్ అవుతుందో అవ్వదో మహేష్ కు బాగా తెలుసు.
అందుకే మహేష్ బాబును కృష్ణ ఒక సినిమా చేయమని రిక్వెస్ట్ చేసిన ససేమీరా అనేశాడు. కృష్ణకు మహేష్ ను పెట్టి బాలీవుడ్ లో పాతాళభైరవి చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉండేది. ఇదే విషయం మహేష్ వద్ద ప్రస్తావించాడు కూడా.
అయితే మహేష్ మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా తాను హిందీలో చేయలేనని, తెలుగులోనే ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉందని చెప్పేశాడట.