మహేష్ ఫ్యాన్స్ ఉలిక్కి పడే పుకారు

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఒకింత కలవర పెట్టే పుకారు ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ విషయమే ప్రచారం జరిగింది.. ఆ సమయంలో అభిమానులు లైట్ తీసుకున్నారు. కాని మరోసారి అదే పుకారు నెట్టింట షికారు చేస్తున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. అదే మహేష్ బాబు తో మురుగదాస్ దర్శకత్వంలో మరో సినిమా వార్త. గతంలో వీరిద్దరి కాంబోలో భారీ అంచనాల నడుమ స్పైడర్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మహేష్ బాబు కెరీర్ లో చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మళ్లీ అదే కాంబో అంటే అభిమానులు ఖచ్చితంగా టెన్షన్ పడతారు.

స్పైడర్ వంటి డిజాస్టర్ ఇచ్చినా కూడా మహేష్ బాబుకు ఇంకా మురుగదాస్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఆమద్య మురుగదాస్ తో సినిమా చేసే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చాడు. ఆ సమయంలోనే ఈసారి ఖచ్చితంగా మురుగదాస్ మంచి కథతో వస్తాడనే నమ్మకంను కూడా మహేష్ బాబు వ్యక్తం చేశాడు. వరుసగా సినిమా లు మరియు రాజమౌళితో సినిమా ఉన్న కారణంగా మురుగదాస్ తో ఇప్పట్లో సినిమా ఉండక పోవచ్చు అని మహేష్ అభిమానులు అనుకున్నారు. కాని మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది లో రాజమౌళి సినిమా కంటే ముందే మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయేమో అంటున్నారు.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబో మూవీ కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఎదురు చూపులకు తెర పడ్డట్లయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో సినిమా కూడా చర్చలు జరుగుతున్నాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అన్నట్లుగా ఈ రెండు ప్రాజెక్ట్ లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఇదే సమయంలో ఎదురు చూడని మరో స్పైడర్ కూడా వచ్చేనా ఏంటీ అన్నట్లుగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.