సర్కారు వారి పాటకు రెండు నెలలే టైమ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్‌ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్‌ దుబాయిలో జరగడంతో కీలక సన్నివేశాల చిత్రీకరన పూర్తి అయ్యింది. మళ్లీ ఇప్పుడు రెండవ షెడ్యూల్‌ ను అత్యంత స్పీడ్ గా పూర్తి చేసేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట అనౌన్స్ చేసి ఏడాదిన్నర అయ్యింది. అందుకే మరింత ఆలస్యం చేయకుండా సినిమాను ముగించాలని టార్గెట్ పెట్టుకున్నారట

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమాకు గాను మహేష్‌ బాబు రెండు నెలల టైమ్ పెట్టాడట. సినిమా షూటింగ్‌ ముగించడానికి రెండు నెలల డేట్లు ఇచ్చిన మహేష్‌ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్‌ మూవీ చేయబోతున్నాడు. రెండు నెల్లలో పూర్తి చేయాల్సిందే అంటూ పరశురామ్‌ కు మహేష్ బాబు అల్టిమేటం జారీ చేయడంతో ప్రస్తుతం దర్శకుడు ఆ హడావుడిలో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా సగం చిత్రీకరణ పూర్తి చేసిన మేకర్స్ రెండు నెలల సమయంలో పూర్తి చేయడ అసాధ్యం ఏమీ కాదని భావిస్తున్నారు. మహేష్‌ కొత్త సినిమా సెప్టెంబర్‌ లో మొదలు పెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారు.