త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తా – మణిరత్నం

విలక్షణ దర్శకుడు మణిరత్నం నవరస పేరుతో ఒక భారీ వెబ్ సిరీస్ ను నిర్మించిన విషయం తెల్సిందే. సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ తదితరులతో పాటు భారీ స్టార్ కాస్ట్ ఈ వెబ్ సిరీస్ లో భాగమైంది. ఏకంగా 9 మంది కోలీవుడ్ దర్శకులు ఈ చిత్రం కోసం పనిచేసారు. ఒక్కో భాగాన్ని ఒక్కొక్కరు డైరెక్ట్ చేసారు.

నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ఆగస్ట్ లో విడుదల కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం మీడియాతో మాట్లాడుతూ డైరెక్ట్ తెలుగు చిత్రం గురించి స్పందించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను సినిమా చేయడానికి ప్రయత్నించానని తెలిపాడు.

“కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు” అని వెల్లడించాడు మణిరత్నం. అయితే మంచి కథ దొరికితే తప్పకుండా మహేష్ బాబుతో సినిమా చేయడానికి తాను రెడీ అని రివీల్ చేసాడు.