మహేష్ తో కూడా బాలయ్య అన్ స్టాపబుల్!!

నందమూరి బాలకృష్ణ ఆహాలో ఒక టాక్ షో చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే బాలయ్య స్టేజ్ మీద ఒక ఫ్లో లో మాట్లాడలేరు. దానికి తోడు ఆయన అల్లు క్యాంప్ లో ఒక షో చేస్తారని ఎవరూ ఊహించలేదు. చివరికి అదే జరిగింది.

ఆహాలో అన్ స్టాపబుల్ మొదలైంది. రెండు ఎపిసోడ్స్ కూడా విడుదలయ్యాయి. దీనికి రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తోంది. బాలయ్య హోస్టింగ్ స్కిల్స్ పై అనుమానం వ్యక్తం చేసిన వారు నోరు మూసుకునేలా చేసాడు బాలకృష్ణ.

బాలయ్య భుజం సర్జరీ కారణంగా అన్ స్టాపబుల్ లో చిన్న విరామం వచ్చింది. ఇప్పుడు మూడో ఎపిసోడ్ లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వస్తున్నారు. అలాగే తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షో లో సందడి చేయబోతున్నాడని తెలుస్తోంది. ఐదో ఎపిసోడ్ గా ఇది విడుదలవుతుందని, షూటింగ్ డిసెంబర్ 4న జరుగుతుందని తెలుస్తోంది.