కరోనా ఎఫెక్ట్‌ ట్రక్ డ్రైవర్‌ గా మారిన నటి

కరోనా ఎన్నో కోట్ల మంది జీవితాలను తారు మారు చేసింది. లక్షల మంది ఉద్యోగులను కోల్పోయేలా చేసింది. కోట్లాది మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఈ సమయంలో కరోనా కారణంగా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలా మంది ఆఫర్లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మలయాళ నటి కార్తీకది అదే పరిస్థితి. ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చివరకు ట్రక్‌ డ్రైవర్‌ గా మారింది.

ట్రక్‌ డ్రైవర్‌ గా కార్తిక కేరళలోని పలు ప్రాంతాలకు పైనాపిల్స్ తో పాటు పలు రకాల పదార్థాలను సరఫరా చేస్తూ ఉంటుంది. ఇటీవల ఒక చెక్ పోస్ట్ వద్ద ఆమె వాహనంను నిలిపి వేసి చెక్ చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్నవారు ఆమెను గుర్తించారు. మీరు నటి కదా అంటూ ప్రశ్నించగా ఆమె ఔను అంటూ తలాండించిందట. దాంతో ఆమె పరిస్థితిని వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆఫర్లు లేని ఈసమయంలో తనకు వచ్చిన డ్రైవింగ్‌ ను ఇలా వినియోగించుకుంటున్నట్లుగా చెప్పింది. డ్రైవింగ్‌ వచ్చిన కార్తిక సొంతంగా ఒక ట్రక్ ను కొనుగోలు చేసి కిరాయికి తానే స్వయంగా తిప్పుతూ ఉంది.