అభ్యర్ధులను ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్..! నందిగ్రామ్ నుంచే దీదీ

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే స్థానాలపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ ఆమె చెక్ పెట్టారు. తాను నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.

అయితే.. అక్కడి నుంచి సోవన్ దేవ్ చటోపాధ్యాయ పోటీ చేస్తారని తెలిపారు. ఈ క్రమంలో బెంగాల్లోని 291 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఇందులో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు. డార్జిలింగ్ లోని మిగిలిన మూడు స్థానాల్లో తమ మిత్రపక్షాలు పోటీ చేస్తాయని కూడా తెలిపారు. బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.