యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు తారక్. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం కూడా తెల్సిందే. ఈ చిత్రం ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ ను ఈ కథకు అనుకుంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ ను ఎన్టీఆర్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ మొదలవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఈ షూటింగ్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ కు కానీ మొదలయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా బ్రేక్ పడింది. మళ్ళీ షూటింగ్ మొదలవ్వాలంటే మరి కొన్ని నెలలు పట్టే అవకాశముంది. ఆర్ ఆర్ ఆర్ విడుదల కూడా వచ్చే ఏడాది జనవరి నుండి సమ్మర్ కు షిఫ్ట్ అయిన విషయం తెల్సిందే.
ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సంగతికొస్తే ఈ సినిమాలో మంచు మనోజ్ నటించనున్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మనోజ్ అయితే సరిగ్గా సరిపోతాడని త్రివిక్రమ్ భావించాడట. అరవింద సమేతలో నవీన్ చంద్రకు ఒక పాత్ర ఇచ్చిన త్రివిక్రమ్, అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కు అవకాశమిచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రానికి మనోజ్ ను అడిగినట్లు తెలుస్తోంది. మరి మనోజ్ ఈ ఆఫర్ కు ఎస్ చెబుతాడా?