చిరంజీవి గారి మద్దతు నాకే ఉంటుంది : విష్ణు

మా ఎన్నికలకు తేదీ దగ్గర పడింది. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ముఖ్యంగా మంచు విష్ణు మరియు ప్రకాష్‌ రాజ్ లు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో గెలుపు పై ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఎన్నికల గురించి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ తాను చేపట్టబోతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తే అందరు నాకే ఓటు వేస్తామని అంటున్నారు.

నామినేషన్ వేసిన తర్వాత చిరంజీవి గారిని కలుస్తాను. ఆయనకు నా మానిఫెస్టో చెప్తాను. నా కార్యక్రమాలు వింటే ఖచ్చితంగా చిరంజీవి గారి మద్దతు నాకే ఉంటుంది. కేవలం మా భవనం మాత్రమే కాకుండా ఇంకా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు నేను ప్రయత్నిస్తాను. అభివృద్దితో పాటు సంక్షేమం ను నేనే బాగా చేపట్టగలను. ఆ నమ్మకంతోనే నేను బరిలోకి దిగుతున్నాను. ఇప్పటి వరకు నాన్నగారు 800 మంది మా సభ్యులతో మాట్లాడారు. వారు అంతా కూడా నాకు మద్దతుగా మాట్లాడారు. నాన్న గారు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోరు.. కాని ఆయనకు ఎవరో ఫోన్ చేసి విష్ణు ను ఎన్నికల నుండి తప్పుకోవాలని సూచించండి అన్నారట. అందుకే ఆ పంథంతో నేను ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన రంగంలోకి దిగారని విష్ణు చెప్పుకొచ్చాడు.