ఉప్పెన సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం సినిమాతో మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా మూడో సినిమాతో మాత్రం మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి అని వైష్ణవ్ టెక్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని మూడవ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రంగరంగ వైభవంగా అనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు.
ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న రంగ రంగ వైభవంగా అనే సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో రీమేక్ సిగేసిన గిరీషయ అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. AMB సినిమాస్ లో ప్రత్యేకంగా ఉదయం 11 గంటలకు యూట్యూబ్ ద్వారా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
కొండపొలం డిజాస్టర్ అనంతరం వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ గ్లామరస్ బ్యూటీ కేతికశర్మ మెయిన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. డిఫరెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా అనంతరం వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తో చేయబోతున్నాడు.
త్రివిక్రమ్ అలాగే సీతారా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించబోతున్న ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వైష్ణవ్ తేజ్ లిస్టులో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఇటీవల వైష్ణవ్ తేజ్ కోసం ప్రత్యేకంగా ఒక కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ మెగా మేనల్లుడు ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.