రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన రోజా

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి మద్య ఒప్పందం జరిగిందని అన్నాడు. రోజా ఇంట్లో ఆ ఒప్పందం జరిగిందని.. ఆ సమయంలోనే కేసీఆర్‌ మరియు జగన్ లకు సంబంధించిన పలు విషయాలపై చర్చ జరిగిందని రేవంత్‌ రెడ్డి అన్నాడు. ఆ విషయమై రోజా తీవ్రంగా స్పందించింది. తన ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలంటూ ప్రశ్నించింది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ రేవంత్‌ రెడ్డిని హెచ్చరించింది.

కేసీఆర్ తన ఇంటికి వచ్చిన సమయంలో జగన్‌ ఎప్పుడు వచ్చారో రేవంత్‌ రెడ్డి చెప్పాలన్నారు. తెలుగు దేశం పార్టీ కోవర్ట్‌ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రేవంత్‌ రెడ్డి తన మూలాలు తెలుసుకుని.. దాని అనుసారంగా మాట్లాడాలంటూ సూచించింది. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న రేవంత్‌ రెడ్డి తన పార్టీ సిద్దాంతాలను ప్రచారం చేస్తూ ఎదగాలే కాని అడ్డదారిలో కాదు అంటూ రోజా హెచ్చరించింది. కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా రోజా ఇంట్లో జగన్ మరియు కేసీఆర్‌ ల మద్య ఒప్పందం జరిగింది అనే విమర్శలు చేస్తున్నారు.