ఓంకార్ గిఫ్ట్ కు స్టన్ అయిపోయిన మోనాల్

నటి మోనాల్ గజ్జర్ ఇండస్ట్రీ నుండి ఫెడౌట్ అయిపోయి ఐదేళ్లు అయిన తర్వాత గతేడాది బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆమె బిగ్ బాస్ లో గ్లామర్ ప్రదర్శనలు, రిలేషన్ లు మైంటైన్ చేయడం తప్ప పెద్దగా చేసేదేం లేదు. బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి కూడా ఆమెకు పెద్దగా సపోర్ట్ లభించలేదు. అయినా కానీ మోనాల్ 14 వారాల పాటు బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగింది.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా మోనాల్ కు అవకాశాలు బాగానే వచ్చాయి. అల్లుడు అదుర్స్ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించింది. అంతే కాకుండా స్టార్ మా లో వస్తోన్న డ్యాన్స్ + షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇప్పుడు ఈ షో పూర్తయింది. ఈ సందర్భంగా ఓంకార్, మోనాల్ గజ్జర్ కు ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది. మోనాల్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఓంకార్ ఇచ్చిన ఫొటోలో మోనాల్ తన తండ్రి పక్కన నిలబడి ఉన్న ఆర్ట్ వర్క్ అదిరింది. ఆ గిఫ్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని, ఓంకార్, స్టార్ మా, డ్యాన్స్ + టీమ్, ఈ ఆర్ట్ కోసం కష్టపడిన వారు ఇలా అందరికీ కృతఙ్ఞతలు తెలిపింది మోనాల్.