తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కరోనా సోకడంతో సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను వెంటనే ఐసీయూలోకి తరలించారని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఆయన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే బీజేపీలో జాయిన్ అయ్యాడు. తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోత్కుపల్లి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన హెల్త్ విషయమై ఆసుపత్రి వర్గాల వారు నేటి సాయంత్రం వరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.