ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మురుగదాస్ చిత్రం?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు ద్విభాషా చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో తెలుగు – తమిళ్ బైలింగ్వల్ చేయనున్న సంగతి తెల్సిందే. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు రామ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో రామ్ పనిచేసే అవకాశాలు ఉన్నాయిట. ఈ మధ్యే వీరిద్దరి మధ్యా ఫోన్ లో కథా చర్చలు నడిచాయట.

మురుగదాస్ చెప్పిన పాయింట్ రామ్ కు తెగ నచ్చేసినట్లు సమాచారం. లింగుసామి సినిమా పూర్తవ్వగానే మురుగదాస్ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రామ్. ఇది కూడా తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలిసే అవకాశముంది.