నాగ చైతన్య థాంక్యూలో హీరోయిన్ కన్ఫర్మ్

అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ సినిమా థాంక్యూ. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కానున్న విషయం తెల్సిందే. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ను ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు.

అయితే హీరోయిన్ విషయంలో బోలెడన్ని రూమర్లు షికార్లు చేసాయి. నభ నటేష్ తో పాటు మరికొందరు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అధికారిక సమాచారం మేరకు రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది.

గతంలో వెంకీ మామలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది రాశి. ఇటీవలే అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసినట్లు సమాచారం. థాంక్యూ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య మహేష్ బాబు అభిమానిగా కనిపిస్తాడు.