చైతూని పెళ్లి చేసుకుని ఆ ఈ రెండు విషయాల్లో అసంతృప్తి

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. తెలుగు వారి కోడలుగా మారిపోయిన చెన్నై బ్యూటీ ఇంకా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళనాడుకు చెందిన సమంత హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం వల్ల కొన్ని రకాల అసంతృప్తులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. సహజంగా ఏ ఆడపిల్ల అయినా కూడా పెళ్లి తర్వాత అత్త వారింటికి వెళ్లిన సమయంలో ఏదో ఒక అంశంలో అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. తల్లిదండ్రులతో ఉన్నంత స్వేచ్చ విషయంలో కాని.. ఇతర విషయాల్లో కాని కాస్త సర్దుకు పోవడం తప్పదు. సమంత కూడా రెండు విషయాల్లో అసంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ రెండు విషయాలు మినహా అన్ని విషయాల్లో కూడా తాను పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది.

ఆ రెండు విషయాల సంగతికి వస్తే.. మొదటగా తమిళనాడు లో పుట్టిన పెరిగిన వారికి ముఖ్యంగా చెన్నై వాసులకు బీచ్ తో విడదీయరాని అనుబంధం ఉంటుంది. బీచ్ తో వారికి ఖచ్చితంగా బాండ్డింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా బీచ్ లో తిరిగి కొన్ని వందల బర్తడే పార్టీలను బీచ్ లో నిర్వహించుకున్నామని.. అక్కడ స్నేహితులతో తిరుగుతూ రోడ్ సైడ్ ఫుడ్ తింటూ ఎంతో ఆనందంగా కాలం గడిపేవాళ్లం. కాని హైదరాబాద్ లో బీచ్ లేకపోవడం వల్ల అది ఖచ్చితంగా మిస్ అవుతున్నాను. హైదరాబాద్ లో ఉన్నప్పుడు తనకు బీచ్ గురించిన ఆలోచనలు వస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. బీచ్ లో సరదాగా గడిపిన మధుర క్షణాలను సమంత నెమరవేసుకుంది. తాను తీయించుకున్న ఫస్ట్ ఫొటో షూట్ బీచ్ లోనే అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

బీచ్ తర్వాత హైదరాబాద్ లో ఉన్న సమయంలో బ్రేక్ ఫాస్ట్ ను కూడా మిస్ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. తమిళనాడు లో ఉంటే అద్బుతమైన బ్రేక్ ఫాస్ట్ ఉదయాన్నే చేస్తాను. కాని ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో అలాంటి బ్రేక్ ఫాస్ట్ లభించదు. హైదరాబద్ లో కూడా ఎన్నో వెరైటీస్ బ్రేక్ ఫాస్ట్ లు ఉంటాయి. కాని సమంత చేసే చెన్నై స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా ఆమెకు లభించదు. అందుకే చెన్నై స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ ను తాను తినలేక పోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రెండు విషయాల్లో అసంతృప్తి కాని అంతకు మించి ఏమీ లేదని.. చైతూ తో లైఫ్ చాలా సంతోషంగా సాగుతున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కూడా పూర్తి స్వేచ్చగా సినిమా లు చేసుకునే అవకాశం ఆమెకు దక్కింది. అందుకే ఆమె చైతూ వల్ల చాలా ఆనందంగా ఉంది. చైతూ తో లైఫ్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కూడా చెప్పింది. సుదీర్ఘమైన ప్రేమను పెళ్లిగా మల్చుకున్న ఈ జంట టాలీవుడ్ లో ఎంతో మంది జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.