అక్కినేని నాగ చైతన్య – సమంత జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని.. వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గత నెల రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించకపోవడంతో.. మీడియాలో సోషల్ మీడియాలో చై-సామ్ జంట విడిపోవడంపై అనేక కథనాలు వస్తున్నాయి. ఈ విషయం అభిమానులుల్లో కూడా గందరగోళం క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సమంత త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అయిపోతుందని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియా వేదికగా పుకార్లకు చెక్ పెట్టింది.
సమంత తన ‘సాకి’ దుస్తుల బ్రాండ్ ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ లో చాట్ సెషన్ నిర్వహించారు. ఇందులో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సామ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ ”నిజంగా మీరు ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా?” అని ప్రశ్నించగా.. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. హైదరాబాద్ తన ఇల్లు అని సమంత స్పష్టం చేసింది. ”ఈ రూమర్ ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ అన్ని రూమర్స్ లాగే అది కూడా ఒక రూమర్. ఇందులో నిజం లేదు. ఎప్పటికీ హైదరాబాద్ నా ఇల్లు. హైదరాబాద్ నాకు అన్నీ ఇచ్చింది.. నేను ఇక్కడే ఉంటాను” అని సమంత తెలిపింది.
అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. నాగ చైతన్య – సమంత దంపతులు ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ”సామ్ తన భర్త చైతన్యతో కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ ని ప్రారంభించాలనుకుంటోంది.. అందుకే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేయలేదు” అని సన్నిహిత వర్గాలు చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. టాలీవుడ్ లో అందమైన జంటగా పిలవబడే చైతన్య – సమంతలు ఎప్పటికీ కలిసే ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య – సమంత ఇద్దరూ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. దీని తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకోనుంది. ఇక చైతూ లేటెస్టుగా ‘లవ్ స్టొరీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ సినిమాతో పాటుగా ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు. అలానే చై ఓ హారర్ వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగుపెడుతున్నారు.