నాని, చైతూ బాక్సాఫీస్ ఫైట్‌ కు రెడీ

కరోనా కారణంగా దాదాపు పది నెలల పాటు సినిమాల విడుదల పూర్తిగా ఆగిపోయాయి. మొన్న సంక్రాంతి నుండి మెల్లగా సినిమాల విడుదల ఆరంభం అయ్యింది. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడపాలని ఆదేశాలు వచ్చాయి. అయినా కూడా పలు సినిమాలు విడుదలకు ముందుకు వస్తున్నాయి. ఇక సమ్మర్ లో పదుల సంఖ్యలో సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఏప్రిల్‌ నుండి మొదలుకుని రెండు మూడు నెలల వరకు కంటిన్యూగా వారంకు రెండు మూడు పెద్ద మోస్తరు సినిమాలు రాబోతున్నాయి.

ఇప్పటికే నాని నటించిన ‘టక్‌ జగదీష్‌’ సినిమాను ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా ను కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు సినిమాలపై కూడా యూత్‌ లో మంచి క్రేజ్ ఉంది. కనుక ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం వల్ల రెండు సినిమాలకు కమర్షియల్‌ గా నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఏమైనా మార్పు చేర్పు వస్తుందేమో చూడాలి.