థాంక్యూలో నాగ చైతన్య రోల్ పై ఫుల్ క్లారిటీ

అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రస్తుతం మార్కెట్ లో ఫుల్ క్రేజ్ ఉంది. రీసెంట్ గా విడుదలైన సారంగదరియా సాంగ్ వల్ల ఆ క్రేజ్ డబల్ అయింది.

ఇక లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య నటిస్తోన్న చిత్రం థాంక్యూ. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాగ చైతన్య మహేష్ బాబు ఫ్యాన్ గా నటిస్తున్నాడని తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక మరో సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో నాగ చైతన్య రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్నాడట. అలాగే థాంక్యూలో నాగ చైతన్య అనాథగా కనిపిస్తాడని అంటున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.