రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలను వైకాపా మంత్రులు నాయకులు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఖండిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుండి పోసాని మరీ సీరియస్ గా వ్యాఖ్యలు చేశాడు. పవన్ తీరును పోసాని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు తిప్పి కొడుతున్నారు. గతంలో ఇదే పోసాని ఆహా ఓహో అంటూ పవన్ ను నెత్తిన పెట్టుకున్నాడు. ఇప్పుడు తిడుతున్నాడు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నాగబాబు కూడా పోసాని వ్యాఖ్యలపై స్పందించాడు. సోషల్ మీడియాలో నాగబాబు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అందులో భాగంగా కుక్కలు మొరిగితే పట్టించుకోవద్దు అన్నాడు. గతంలో పోసాని మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు. అందులో పవన్ గొప్ప హీరో, అతడితో సినిమాను నిర్మిస్తాను అన్నాడు. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం ఎందుకు అంటూ నాగబాబు ఎద్దేవగా సమాధానం ఇచ్చాడు. ఏపీ ప్రభుత్వం టికెట్లు అమ్మడంపై స్పందిస్తూ దొంగలు డబ్బును పంచుకున్నట్లుగా ఉందని పేర్కొన్నాడు.