మెగా బ్రదర్ నాగబాబు సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్ కామెడీ షో కు జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో చాలా మంది కమెడియన్స్ తో నాగబాబు సన్నిహితంగా ఉండేవాడు. అందులో సుధీర్ కూడా ఒకడు. నాగబాబును సుడిగాలి సుధీర్ డాడీ అంటూ పిలవడం ఆయన కూడా సరదాగా తీసుకోవడం జరిగేది. మొత్తానికి నాగబాబు మరియు సుడిగాలి సుధీర్ చాలా క్లోజ్ గా ఉండే వారు. కాని జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాక నాగబాబుకు సుధీర్ పై కోపం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల నాగబాబు సోషల్ మీడియా లైవ్ కు వచ్చిన సమయంలో సర్ సుధీర్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించగా శత కోటి సుధీరుల్లో ఏ సుధీర్ గురించి నువ్వు అడిగేది అంటూ రిప్లై ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ గురించి అనే విషయం తెలిసినా కూడా ఆయన గురించి స్పందించడం ఇష్టం లేక ఇలా అని ఉంటాడని అంటున్నారు. జబర్దస్త్ నుండి తాను బయటకు వెళ్లిన సమయంలో తన వెంట రాని కారణంగా సుధీర్ పై కోపంగా ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రామ్ ప్రసాద్ మరియు శ్రీనుల్లో ఎవరు ఇష్టం అంటే గెటప్ శీను ఫొటోను ఆయన షేర్ చేశాడు. గెటప్ శీను అంటే ఇష్టం కాని సుధీర్ ఎందుకు ఇష్టం లేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.