ఆన్ లైన్ లో మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్చుకుంటున్న నాగార్జున

సీనియర్ హీరో నాగార్జున గత కొన్ని రోజులుగా తన రూట్ ను మార్చుకున్నాడు. ఫక్తు కమర్షియల్ చిత్రాల నుండి దూరంగా జరిగి సీరియస్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. అయితే గత కొన్ని సినిమాలుగా నాగార్జున పోలీస్ ఆఫీసర్ లేదా స్పెషల్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నాడు. వైల్డ్ డాగ్ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెల్సిందే.

ఇందులో కూడా స్పెషల్ ఆఫీసర్ రోల్ చేస్తున్నా కానీ చాలా కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే కెరీర్ లో ఫస్ట్ టైమ్ నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం కోవిద్ సెకండ్ వేవ్ నడుస్తుండడంతో విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. అలాగే విదేశీ ట్రైనర్ ను కూడా పిలిపించుకోలేడు. దీంతో నాగార్జున ఆన్లైన్ లోనే మార్షల్ ఆర్ట్స్ కోర్స్ తీసుకుంటున్నాడట.