వైల్డ్‌ డాగ్‌ ను ప్రశంసించిన ఆచార్య

నాగార్జున నటించిన వైల్డ్‌ డాగ్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. నాగార్జునకు చాలా కాలం తర్వాత ఒక మంచి సక్సెస్‌ దక్కిందని ఇండస్ట్రీలో కూడా టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలోనే వైల్డ్‌ డాగ్‌ సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. వైల్డ్‌ డాగ్‌ సినిమా ట్రైలర్‌ ను చిరంజీవి విడుదల చేసిన విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా చిరంజీవి మరియు నాగార్జునలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. తాజాగా చిరంజీవి ట్విట్టర్‌ లో సినిమా రివ్యూ షేర్‌ చేయడం తో వైల్డ్‌ డాగ్‌ కు మరింత పబ్లిసిటీ దక్కింది.

చిరంజీవి ట్విట్టర్‌లో… ఇప్పుడే #WildDog చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు @iamnagarjuna వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు #Solomon,నిర్మాత #NiranjanReddy లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు.. ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం.. డోంట్ మిస్ దిస్ #WildDog ! వాచ్ ఇట్ !! అంటూ ట్వీట్‌ చేశాడు.