నాచురల్ స్టార్ నాని గత నెలలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. కంప్లీట్ మాస్ అండ్ రా కల్ట్ సబ్జెక్టుతో న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమా చేయడం విశేషం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మూవీలో నాని పోషించిన ధరణి పాత్ర అయితే బాగా కనెక్ట్ అయింది. నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా దసరా నిలిచింది. ఇదిలా ఉంటే దసరా రిలీజ్ కి ముందే నాని మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా కొత్త దర్శకుడుతోనే చేయడం విశేషం. శౌర్యువ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతూ ఉన్నారు.
నాచురల్ స్టార్ నాని 30వ సినిమాగా ఇది తెరకెక్కుతూ ఉండడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మృణాల్ ఠాగూర్ తెలుగులో చేస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం. తండ్రి కూతుళ్ళ అనుబంధం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతుంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా విడాకులు తీసుకున్న భార్య భర్తల మధ్య నలిగిపోయే చిన్నారి పాత్ర దృక్కోణం నుంచి ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ ఇదొక అద్భుతమైన కథ అని చెప్పారు. ఇదిలా ఉంటే హాయ్ నాన్న అనే టైటిల్ ఈ సినిమాకి నిర్ణయించినట్లుగా ప్రచారం నడుస్తోంది.
తండ్రి కూతుర్ల అనుబంధం ప్రధాన ఇతివృత్తం కావడంతో ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ మూవీకి ఫైనల్ చేసినట్లుగా టాక్. గతంలో నాని జెర్సీ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో కథాంశాన్ని ఆవిష్కరించి బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ స్టోరీని తెరపై ఆవిష్కరిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.