ఈ దశాబ్దంలో వచ్చిన అత్యుతమ చిత్రాల్లో కచ్చితంగా నాని నటించిన జెర్సీ సముచిత స్థానం దక్కించుకుంటుంది. క్రికెట్ నేపథ్యంలో సెంటిమెంట్ ను మిక్స్ చేసి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన తీరుకి అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాతోనే గౌతమ్ కు బాలీవుడ్ ఛాన్స్ దక్కింది. షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసాడు. ఇప్పుడు మరోసారి నాని, గౌతమ్ కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. జెర్సీ హిందీ చిత్రం విడుదలయ్యాక ఈ సినిమా మొదలవుతుందని సమాచారం.
మొదటిసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్న గౌతమ్ ఈసారి దేశభక్తిని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలిసే వీలుంది. అలాగే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది.