రిపబ్లిక్ సినిమాపై నారా లోకేష్ వాఖ్యలు

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా రిపబ్లిక్. దేవ్ కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం సినిమాను ప్రశంసిస్తున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు.

‘రిపబ్లిక్ సినిమా గురించి ఆన్నీ పాజిటివ్ రిపోర్స్ట్స్ వస్తూన్నాయి. త్వరలోనే ఈ సినిమాను చూస్తాను. సాయి ధరమ్ తేజ్ త్వరగా మొక్కుకోవాలి’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇటీవల ఈ సినిమా ఫంక్షన్ లొనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.