ఆర్‌ నారాయణ మూర్తిపై బాబు గోగినేని ఫైర్‌

హేతువాది అయిన బాబు గోగినేని ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక విషయమై మాట్లాడుతూ వివాదాస్పదంగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన పీపుల్స్ స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీడియాలో నిలిచాడు. ఆనందయ్య కరోనా మందు గురించి బాబు గోగినేని మొదటి నుండి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఆనందయ్య మందు అస్సలు వాడవద్దు అన్నట్లుగా ఆయన చెబుతున్నాడు. అలాంటి బాబు గోగినేని ఎవరైతే ఆనందయ్య మందును సమర్థిస్తున్నారో వారిని టార్గెట్‌ చేస్తున్నాడు.

మొదట జగపతి బాబు ఆనందయ్య మందుకు జెండా ఊపాడు. ఆ తర్వాత ఆర్‌ నారాయణ మూర్తి కూడా ఆనందయ్య మందు పై ప్రశంసలు కురిపించారు. దాంతో ఆర్‌ నారాయణ మూర్తిపై బాబు గోగినేని విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. నారాయణ మూర్తి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపించారు. ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఆయన తీరు పై విమర్శలు వ్యక్తం చేశాడు. పీపుల్స్ స్టార్స్ గురించి ఎవరు మాట్లాడిన నెగటివ్‌ గా మాత్రం మాట్లాడరు. కాని బాబు గోగినేని మాత్రం విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.