బిగ్ బాస్ 5 సన్నాహకాలు మొదలైపోయాయి. సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ సీజన్ 5 మొదలుకాబోతోంది. ఈ నేపథ్యంలో షో కు సంబంధించిన పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ను ఇప్పటికే దాదాపుగా ఫైనల్ చేసేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లోకి వెళ్లిబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ సీరియల్ నటి నవ్య స్వామి కూడా బిగ్ బాస్ లోకి వెళ్తుందని తెల్సింది. ఆమె కథ, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ తో నవ్య స్వామి తెలుగు ఇంట చాలా ఫేమస్.
ఆమె ప్రస్తుతం నటిస్తోన్న సీరియల్స్ నుండి బ్రేక్ తీసుకుంటోందని, అది బిగ్ బాస్ కోసమే అని ప్రచారం ఉంది. అయితే స్టార్ మా కంటెస్టెంట్స్ వివరాలను గోప్యంగా ఉంచుతుంది. షో మొదటి రోజునే కంటెస్టెంట్స్ వివరాలను బయట పెడతారు.